నీళ్లడిగితే దూషిస్తరా?
కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
- శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. సాగునీరు అందించడంలో విఫలమైన ప్రభుత్వానికి తెలంగాణ సమాజం, రైతాంగం తగిన బుద్ధి చెప్పి తీరుతుందని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు మళ్లీ తెరలేపారని ఆరోపించారు. షాబాద్ మండలంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు దారుణహత్యకు గురై 24 గంటలు గడిచినా నిందితుడిని పట్టుకోలేకపోవడం ప్రభుత్వం, పోలీస్‌శాఖ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిందితుడిని పట్టించిన వారికి రూ.2 లక్షల బహుమతి ప్రకటించడమే శాంతిభద్రతల వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యమని తెలిపారు. ఈ ఘోర ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని పాత ఆరోపణలే మళ్లీ చేశారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

