బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు
తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మం గళవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
- బీజేపీ, కాంగ్రెస్‌ది విష ప్రచారం
- ప్రణీత్‌రావు ఎవరో నాకు తెలియదు
- మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు
హనుమకొండ, మార్చి 19: తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మం గళవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరుతున్న వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే తనపై విష ప్రచారం చేస్తున్నాయని మం డిపడ్డారు.
కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. వ్యాపారాలు, భూ దందాలు, తప్పుడు పనులు చేసిన నాయకులు పార్టీని వీడుతుంటే కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన చూసి బీఆర్ఎస్ పార్టీని ఓడించి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటికి వరకు 2 పథకాలు మా త్రమే అమలు చేసిందని విమర్శించారు. వంద రోజుల పాలనలో పంటలు ఎండిపోయాయని, కరెంటు రావడం లేదు, తాగునీరు అందడం లేదని ఇందుకు కారణం కాం గ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, వార్ రూంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రణీత్‌రావు ఎవరో తెలియదని అన్నారు. ఆయన అమ్మమ్మ ఊరు త మ స్వగ్రామం పర్వతగిరి అయినంత మా త్రాన ఆయనతో సంబంధం ఉన్నట్టా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

