తొర్రూరు, ఫిబ్రవరి 7 : పాలేరు (బయ్యన్న) వాగులో నీళ్లను మంత్రి ఎత్తుకుపోతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కరాల గ్రామం పాలేరు (బయ్యన్న) వాగును శుక్రవారం ఎర్రబెల్లి సందర్శించారు. సాగు నీరు అందక పొలాలు ఎండిపోతుండడంతో ఆ గ్రామ రైతులు మాజీ మంత్రి దయాకర్‌రావుకు ఫోన్ చేసి తమ వేదనను చెప్పుకొన్నారు.
జిల్లాలో వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన, రైతుల పిలుపునకు వెంటనే స్పందించి పాలేరు (బయ్యన్న) వాగును సందర్శించారు. రైతుల గోస విన్న మాజీ దయాకర్‌రావు ఇరిగేషన్ శాఖ సీఈ, ఎస్ఈ అధికారులతో ఫోన్లో మాట్లాడి కరాల రైతుల పరిస్థితిని వివరించారు. దీంతో రెండు రోజుల్లో నీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.