వర్ధన్నపేట, ఏప్రిల్ 12 : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో శనివారం నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి అబద్ధపు మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నాడని విమర్శించారు.
32 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే వ్యతిరేకంగా ఉన్నారని, ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజల్లో కాం గ్రెస్పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నందునే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ముందుకు రావడంలేదన్నారు. ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు.