హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాల సేకరణ వేగవంతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.56 లక్షల మంది ఓటర్లకు బీఎల్వోలు ఎన్యుమరేషన్ పత్రాలు అందజేశారు.
ఇప్పటివరకు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియ 75.73 శాతానికి చేరుకున్నదని సీఈవో కార్యాలయం వెల్లడించింది. మిగిలిన ఓటర్లకు కూడా త్వరితగతిన ఈ పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకొంటున్నారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకొని, ఎన్యుమరేషన్ ప్రక్రియకు సహకరించాలని అధికారులు కోరారు.