హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఈ నెల 25న ఓటర్ల ఇంటింటి సర్వే ప్రారంభమైంది. బూత్ లెవెల్ అధికారులు మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1,02,75,000 మంది ఓటర్లకు సర్వే ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 30.08 శాతం మందికి ఫారాలు అందించామని, ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా సాగుతున్నదని ఈసీవో కార్యాలయవర్గాలు వెల్లడించాయి.