నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం : ఐఎండీ
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ నెమ్మదించిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరక్టర్ నాగరత్న తెలిపారు. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేదన్నారు. ఈ రెండు సముద్రాల్లోని గాలులు బలంగా ఉన్నప్పుడు అవి కలుస్తాయని, అప్పుడు సముద్రంలోని తేమ భూమి మీదకు వస్తుందని, దీంతో నైరుతి రుతుపవాలు వేగంగా విస్తరిస్తాయన్నారు. ఈ గాలులు రెండు, మూడు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు.
ఈ నెల 12 నాటికి రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నాగరత్న పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయన్నారు. బుధవారం 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైగా నమోదయ్యాయని టీఎస్‌డీపీఎస్ తెలిపింది. ఐదు జిల్లాల్లో 39 డిగ్రీలపైన, 3 జిల్లాల్లో 38 డిగ్రీలపైన, 2 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16 జిల్లాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వ 3.80, మొగలమడ్క 2.98 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

