కోల్‌కతా: స్కూల్లో చదువుతున్న బాలుడిని అటెండెంట్ లైంగికంగా వేధించాడు. టాయిలెట్లోకి తీసుకెళ్లి బాలుడి నోట్లో ప్రైవేట్ పార్ట్ ఉంచి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఆ స్కూల్ వద్ద నిరసన తెలిపారు. (Boy Assaulted By Attendant) ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడిపై స్కూల్లోని టాయిలెట్ అటెండెంట్ శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. టాయిలెట్ కోసం వచ్చిన ఆ బాలుడ్ని లోపలకు తీసుకెళ్లి డోర్ మూశాడు. అతడి నోట్లో ప్రైవేట్ పార్ట్ ఉంచి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతడి స్నేహితుడు టాయిలెట్ డోర్ తట్టడంతో అటెండెంట్ ఆ బాలుడ్ని వదిలేశాడు.
కాగా, ఈ సంఘటన పట్ల తీవ్ర ఆందోళన చెందిన ఆ బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత తన తల్లికి చెప్పాడు. దీంతో బాలుడి పేరెంట్స్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో స్థానికులతో కలిసి స్కూల్ వద్ద నిరసన తెలిపారు.
మరోవైపు ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్థారించుకున్న తర్వాత స్కూల్ అటెండెంట్‌ను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.