Chora Shikamanulu | టాలీవుడ్లో యాక్షన్ క్రైం కామెడీ జోనర్లో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే లైన్లో ఎంటర్టైన్ చేసేందుకు సంపూర్ణేశ్ బాబు అండ్ టీం చోర శికామణులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ కుర్మా కథ, కథనం, మాటలు అందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ అయింది. రామ్ తేజ్, సంపూర్ణేశ్ బాబు, జబర్థస్త్ ఇమ్మాన్యుయేల్, నరేశ్, అజయ్ ఘోషన్, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్ధస్త్ సత్య శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆనంద్ రాజా విక్రమ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. డ్రాగన్ ప్రకాశ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. జులై 25 నుంచిరెగ్యులర్ షూటింగ్ షురూ కానుండగా.. సూపర్ సాంగ్‌తో సినిమా చిత్రీకరణ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు. శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్‌పై బానూరు నాగారాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి సంపూర్ణేశ్ బాబు సినిమాలో ఉన్నాడంటే పక్కా ఎంటర్టైన్ మెంట్ ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Lights. Camera. Celebration! ✨#ChoraShikamanulu kicks off with a grand Pooja Ceremony!
Starring #RamTej and directed by #AnandKurma, this action-crime-comedy entertainer begins its regular shoot from July 25.
Presented by #SreekariVivaan and produced by #NagarajuBanaru… pic.twitter.com/WXcxisG1Sy
— BA Raju’s Team (@baraju_SuperHit) July 13, 2026