Rajkumar : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన మేనమామ ఊరైన కొత్తూరులో అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారం రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్న ఆ వీడియోను ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషీ మీడియాకు విడుదల చేశారు.
పోక్సో కేసు పెట్టారనే కోపంతో షాబాద్‌లోని బాలిక కుటుంబంపై పగ పెంచుకున్న రాజ్‌కుమార్‌పై రాగానే ప్రతీకారానికి పూనుకున్నాడు. జూలై 10న కత్తితో నరమేధం సృష్టించాడు. బాలికను చంపుతుండగా అడ్డమొచ్చిన ఆమె తల్లి, అమ్మమ్మను దారుణంగా హతమార్చిని నిందితుడు.. ఆపై ఇంటికి వెళ్లి.. కర్కశంగా భార్యను, కన్నబిడ్డలను సైతం కడతేర్చాడు. అనంతరం పరారైన అతడి కోసం 12 పోలీసు బృందాలు గాలించగా.. సోమవారం కొత్తూర్‌లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకోగా సెల్ఫీ వీడియో లభించింది. అందులో.. సంచలన విషయాలు వెల్లడించాడు.
తన చావుకు నలుగురు కారణమని పేర్కొన్న రాజ్‌కుమార్.. పక్కింటి అక్షయ తనను ఏడాదిన్నరగా వేధింపులకు గురి చేసిందని వాపోయాడు. తమ విషయం వారి నాన్నకు కూడా తెలుసని, తన ఫోన్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని చెప్పిన రాజ్‌కుమార్.. వారి కోసం తాను చాలా డబ్బులు ఖర్చు చేశానని తెలిపాడు. తన బిడ్డలకు భూమి లేకుండా పోయిందని అతడు బాధ పడ్డాడు. అంతేకాదు ఒక బాండ్ పేపర్ మీద రాజ్‌కుమార్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది.