హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రీ ప్రైమరీ స్కూళ్ల బాధ్యతలను తమకే ఇవ్వాలని రాష్ట్ర(మినీ) అంగన్వాడీ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శృతి ఓజాకు వినతిపత్రం అందజేశారు. అప్గ్రేడ్ అయిన సెంటర్ల అంగన్వాడీ సిబ్బందికి 12 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఒకటో తేదీన వేతనాలు ఖాతాల్లో జమచేయాలని విజ్ఞప్తి చేశారు.