హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి ఈ నెల పదోతేదీలోగా వందశాతం వ్యాక్సిన్లు వేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని శనివారం సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని సిబ్బందితోపాటు 18 ఏండ్లు నిండిన విద్యార్థులకు సైతం టీకాలు వేయించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ పురోగతిపై రోజువారీ నివేదికను నిర్దిష్ట ప్రొఫార్మాలో తమకు పంపించాలని ఆదేశించారు.