Telangana | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్(నమోదు) తగ్గుతున్నది. గతంలో 28లక్షలున్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 18 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఈ నాలుగేండ్లల్లోనే పది లక్షలు తగ్గింది. ఎన్రోల్మెంట్ పెంచాలంటే ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యనందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
జూన్ నుంచి సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టి, మహిళా టీచర్లను నియమించాలని సర్కారు భావిస్తున్నది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)ని అమలుచేయడం ఖరారయ్యింది. 5+3+3+4 విద్యావిధానాన్ని అమలుచేసే దిశలో ప్రయత్నం చేస్తున్నది.