హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 8 ప్రభుత్వ దవాఖానలకు కేంద్ర ప్రభుత్వం ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికెట్ మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లా కొండపాక, నల్లగొండ జిల్లా వింజమూర్, సూర్యాపేట జిల్లా యండ్లపల్లి, కాసర్లపహాడ్, ఆదిలాబాద్ జిల్లా వాఘాపూర్, నిపని హెచ్డబ్ల్యూఎస్లకు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట, వనపర్తి జిల్లా కమాలుద్దీన్పూర్ పీహెచ్సీలకు ఈ సర్టిఫికెట్లు దక్కాయి. దవాఖానలోని అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, నాణ్యమైన సేవలు అందించడంపై కేంద్ర బృందం అధ్యయనం చేసి ఈ ఎన్క్వాస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది.