హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పూర్తి డీపీఆర్‌ను అందజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీకి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంను చేపట్టిందని ఏపీ సర్కారు మరోసారి విషం వెళ్లగక్కింది. డీపీఆర్‌ను బోర్డుకు అందజేసినట్టు తెలంగాణే వెల్లడించిందని లేఖలో పేర్కొన్నది.