హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం రిజర్వాయర్ ప్రమాదపుటంచున ఉన్నదని, సత్వరమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ కోరారు.
ఈ మేరకు ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ హోదాలో ఈఎన్సీ అనిల్‌కుమార్ తాజాగా లేఖ రాశారు. శ్రీశైలం డ్యామ్ స్పిల్‌వే దిగువన భారీ విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడిందని, 2009లో వచ్చిన వరదలతో అది విస్తరించిందని వివరించారు.