హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దేశంలో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా సెలవులు, విదేశీ టూర్లను తక్షణం రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రజలు తగినంత ఆహార నిల్వలు ఉండేలా సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.