రేపు ఉద్యోగుల జేఏసీ మహాధర్నా
ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మరోసారి ఉద్యమబాట పట్టింది. మెరుగైన ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపు, సమర్థవంతంగా హెల్త్ కార్డుల అమలు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నది. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించనుండగా, అదే రోజు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు జరుగుతాయని జేఏసీ నేతలు ప్రకటించారు.
- ఇందిరాపార్క్ వద్ద ఆందోళన.. కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
- ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమం
- మహాధర్నాకు పెన్షనర్స్ జేఏసీ, టీజీఈజేఏసీ మద్దతు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మరోసారి ఉద్యమబాట పట్టింది. మెరుగైన ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపు, సమర్థవంతంగా హెల్త్ కార్డుల అమలు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నది. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించనుండగా, అదే రోజు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు జరుగుతాయని జేఏసీ నేతలు ప్రకటించారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిషారం లభించకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నామని జేఏసీ నాయకులు స్పష్టంచేశారు. ఆర్థిక పరిస్థితుల పేరుతో ఉద్యోగుల హకులను వాయిదా వేయడం సరికాదని, న్యా యంగా దకాల్సిన ప్రయోజనాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. మహాధర్నాతో ప్రభుత్వానికి తమ నిరసనను బలంగా తెలియజేయడంతోపాటు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఎంప్లాయీస్ జేఏసీ ఉద్యమానికి పెన్షనర్స్ జేఏసీ, మెడికల్ అండ్ హెల్త్ టీజీఈజేఏసీ మద్దతు పలికింది.
గురువారం నిర్వహించనున్న మహాధర్నాకు సంఘీభావం ప్రకటించింది. సెప్టెంబర్ 1న తలపెట్టిన పెన్షన్ విద్రోహ దినోత్సవం.. సెప్టెంబర్ 10న జరిగే ‘చలో హైదరాబాద్’లో పెన్షనర్లు పాల్గొనాలని జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ సత్యనారాయణ ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన తెలిపేందుకే ధర్నాకు పిలుపు ఇచ్చినట్టు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు దక్కాల్సిన రెండో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ డిమాండ్‌చేశారు. ఈ సారి ఉద్యమం విషయంలో వెనక్కి తగ్గబోమని, ఉద్యోగుల సత్తా ఏందో చాటుతామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

