శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:04:05

వ్యవసాయవర్సిటీ వీసీ ప్రవీణ్‌రావుకు ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డు

వ్యవసాయవర్సిటీ వీసీ ప్రవీణ్‌రావుకు ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వీ ప్రవీణ్‌రావు.. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ అవార్డును అందజేస్తున్నాయి. దేశంలో వ్యవసాయరంగ ప్రగతికి తోడ్పాటునందిస్తున్న శాస్త్రవేత్తలు, వృత్తినిపుణులకు రెండేండ్లకోసారి ఈ అవార్డును ఇస్తారు. ఐకార్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ పరోడా నేతృత్వంలోని ఎంపిక కమిటీ వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక రంగాలలో నిష్ణాతులైన 13మంది నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించింది. వ్యవసాయ పరిశోధన, బోధన, విస్తరణ, పరిపాలనలో పనితీరు ఆధారంగా ప్రవీణ్‌రావును ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు కమిటీ ప్రకటించింది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి వీసీగా ప్రవీణ్‌రావు తీసుకున్న పలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో వర్సిటీ దేశంలో ఆరోస్థానంలో నిలిచింది. 


logo