హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం ఆవిర్భవించింది. మొత్తం 1,062 గురుకులాల ప్రిన్సిపాళ్లు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అ యి, సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. అనంతరం మంత్రుల నివాసంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సంఘం కార్యవర్గ సభ్యులకు వినోద్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. సంఘానికి గౌరవ సలహాదారుగా వినోద్‌కుమార్, అధ్యక్షుడిగా డాక్టర్ ఆర్ అజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాంబాబు, సంయుక్త కార్యదర్శిగా పీ చంద్రమోహన్, కోశాధికారిగా రాజేశం, మహిళా కార్యదర్శిగా నీలిమాదేవి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జిగా విద్యాసాగర్, వరంగల్ ఇన్చార్జిగా టీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.