(Elon Musk School) వరంగల్: ఆ బుడ్డోడి వయసు పదకొండేండ్ల.. కానీ, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఎలోన్ మస్క్ పాఠశాలలో అడ్మిషన్ పొందాడు. అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతికతతో ఈ పాఠశాలలో చదువు చెప్పేలా ఎలోన్ మస్క్ స్థాపించిన ‘సింథసిస్’ స్కూల్‌ను నెలకొల్పారు. ఈ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ఎన్నో వడపోతలను దాటుకుని రావాలి. చివరకు ఆన్లైన్ ఇంటర్వ్యూలో నిర్వాహకులను మెప్పించాలి. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని సీట్ సాధించాడు. ప్రస్తుతం ఆన్లైన్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ చిన్నోడికి ఈ స్కూల్లో ఇంటర్ వరకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో విద్యాభ్యాసం అందనున్నది.
పరకాలకు చెందిన విజయ్‌పాల్, సృజన దంపతుల ముద్దుల తనయుడు పదకొండేండ్ల అనిక్‌పాల్.. ప్రస్తుతం వరంగల్ నిట్ సమీపంలోని గవర్నమెంట్ ఆర్ఈసీ పాటక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి జాఫర్‌గఢ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి కొత్తదనం కోసం వెంపర్లాడే అనిక్‌పాల్.. మొబైల్ ఫోన్లో గేమ్ ఆడటమే కాకుండా వాటిని ఎలా తయారుచేశారని విశ్లేషిస్తాడు. ఇదే క్రమంలో కోడింగ్, పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మేకిన్ లెర్నింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులు చదివాడు. మద్రాస్ ఐఐటీ నిర్వహించిన గిన్నిస్ బుక్ వరల్డ్ కార్యక్రమంలో తక్కువ సమయంలో ప్రాజెక్టు సమర్పించి అందరి కండ్లు తనపై పడేలా చేసుకున్నాడు. అనిక్ అబాకస్, రూబిక్ క్యూబ్, మెమోరీ టెక్నిక్లను కూడా సాధన చేస్తుంటాడు.
(Elon Musk School) ఎలోన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిన అమెరికా వ్యాపారవేత్త. స్పేస్ ఎక్స్‌తో పాటు టెస్లా సంస్థలను స్థాపించాడు. విద్యార్థుల వాయిస్, వ్యూహాత్మక ఆలోచన, ఉమ్మడిగా సమస్యను పరిష్కరించడం అనే అంశాలతో ‘సింథసిస్’ అనే ప్రయోగాత్మక పాఠశాలను ప్రారంభించాడు. ఈ స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు దేశవిదేశాల పిల్లలు పోటీపడుతుంటారు. అయితే, ఇక్కడ సీటు పొందడం ఆషామాషా వ్యవహారం కాదు. మూడు స్థాయిల్లో ప్రవేశ పరీక్ష ఉండగా.. వీడియోలు, గేమ్స్ రూపంలో ప్రశ్నలుంటాయి. వాటిని చిన్నారులు ఎలా పరిష్కరిస్తున్నారనేది పరిశీలిస్తారు. చివరగా ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులను ఎంపికచేస్తారు. అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన అనిక్‌పాల్.. ఈనెల 12 న అడ్మిషన్ పొందాడు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు అటెండ్ అవుతున్నాడు. కొవిడ్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత అనిక్‌పాల్‌ను అమెరికా పంపేందుకు తల్లిదండ్రులు విజయ్‌పాల్, సృజన ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..