నిరంతర విద్యుత్తు సరఫరాలో తెలంగాణ రికార్డ్
రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా 2014 అనంతరం విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు.
- 50 వేల కోట్లతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్
- మారుమూల గ్రామాలకూ సరిపడా సరఫరా
- సీఎం కేసీఆర్ దార్శనికతతో విద్యుత్తు విజయాలు
- 18,567 మెగావాట్లకు పెరిగిన సామర్థ్యం
- రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేశామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా 2014 అనంతరం విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డ్ సృష్టించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పారిశ్రామికవేత్తల ఇంటారాక్టివ్ సెషన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ‘తెలంగాణ రాష్ట్రం -ఇంధన రంగంలో భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు. 50 వేల కోట్లతో విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడం వల్లే ఈ రోజు పారిశ్రామికవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారని వివరించారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది కృషి ఉన్నదని వివరించారు. 2014కు ముందు పారిశ్రామికవేత్తలు ఎంత ధర అయినా చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌పై ఒత్తిడి తెవొద్దని పారిశ్రామికవేత్తలకు మంత్రి హితవు పలికారు. ప్రభుత్వానికున్న సామాజిక బాధ్యతలు దృష్ట్యా ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ఇంధన శాఖా కార్యదర్శి సునీల్ శర్మ, సుమారు 150 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

