Minister Seethakka | సీతక్క మీటింగ్లో పవర్ కట్.. కాంగ్రెస్ సర్కార్ పవర్ పాలసీ తీరిది
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలోనే 20 నిమిషాలు కరెంటు పోయింది.
- 20 నిమిషాలపాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
- చీకట్లోనే కొనసాగిన ప్రసంగం
Minister Seethakka | వరంగల్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలోనే 20 నిమిషాలు కరెంటు పోయింది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతుండగా 20 నిమిషాలు కరెంటు కట్ అయ్యింది. వరంగల్ నడిబొడ్డున ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియం ఏరియాలో ఆదివారం మంత్రి పాల్గొన్న కార్యక్రమంలోనే కరెంటు పోవడంపై పలువురు సర్కార్ తీరును తప్పుబట్టారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక తరపున మంత్రి సీతక్కకు నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎఫ్ఐఆర్ నమోదైన వారినే కాకుండా కేసులు నమోదుకాని ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వీరిని ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు. ఉద్యమకారుల వేదిక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకుపోతానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి, వారి ఆశయాలను అమలుకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రి సీతక్క అధికారులతో ఫోన్లో మాట్లాడగా చివర్లో కరెంట్ రావడంతో అందరూ చప్పట్లు కొట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

