హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య కోరా రు. బుధవారం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని, అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో కొంతమంది మాజీ సర్పంచులు ఆ త్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయా రు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పా ల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ ఉపాధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, మధు, ప్రధాన కార్యదర్శి నాగయ్య, కోశాధికారి నవీన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘హెచ్ఎంపీవీ’పై స్కూల్స్ అలర్ట్
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రా ష్ట్రంలోని పాఠశాలలు అప్రమత్తమయ్యా యి. కరోనా నాటి జాగ్రత్తలను పాటించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు జారీ చేశా యి. శానిటైజర్ ఉపయోగించాలని, తరుచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని , కరచాలనం సహా రద్దీగా ఉండే ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నాయి. అనారోగ్యంతో ఉన్న పిల్లలను బడులకు పంపించొద్దని తెలిపాయి. ఈ విషయంపై ట్రస్మా సలహాదారు యాదగిరి శేఖర్‌రావు స్పందిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కానీ విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా జాగ్రత్తలు చెప్తున్నట్టు పేర్కొన్నారు.