హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాకే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఇందిరాపార్క్ వద్ద 18న ధర్నాకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్య, కార్యదర్శి మల్లయ్య, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను అధికారులు సమీపంలోని ప్రభుత్వ కా ర్యాలయాల్లోకి తరలించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. చిన్నారులకు పౌష్టికాహారం, ఖాళీల భర్తీ, అంగన్వాడీ సేవల్లో మహిళా సంఘాల భాగస్వామ్యంపై సీతక్క చర్చించారు.