హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌కు 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర కు రాష్ట్ర సహకార శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సొసైటీ ఎన్నికలను నిర్వహించడం లేదంటూ బీ గోపరాజు తదితరులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. ప్రస్తుత కమిటీ సభ్యుల జోక్యం లేకుండా, ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికతో ప్రమేయం లేకుండా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సహకార సంఘ అధికారిని ఆదేశించారు.