వెంగళరావునగర్, అక్టోబర్ 14 : వెంగళరావునగర్‌లోని బూత్ నంబర్ 125లో నమోదైన బోగస్ ఓట్లపై ఎన్నికల విచారణాధికారులు మౌనం వీడటం లేదు. ‘ప్లీజ్ మమ్మల్ని ఏమీ అడగొద్దు. మేము నోరు తెరిస్తే మా ఉద్యోగాలు పోతాయి’ అని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
‘80 గజాల ఇంట్లో 24 ఓట్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎన్నికల కమిషన్ అధికారులు విచారణ చేపట్టారు. బూత్ నంబర్ 125లో 8-3-191/369 ఇంటి నంబర్‌తో మూడు అంతస్తుల భవనంలో 27 ఓట్లు ఉన్నాయి. వాటిలో 24 బోగస్ ఓట్లే ఉన్నాయి.