(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్) ముమ్మరంగా కొనసాగుతున్నది. ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఓటరు సమగ్ర సర్వే ఇదే. రాష్ట్రంలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వా రా గుర్తిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. వివి ధ రాష్ర్టాల్లో ఓటు హక్కు ఉంటే ఆధార్ , ఎపిక్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, కుటుంబ వివరాలు పరిశీలించి డూప్లికేట్ నమోదులను గుర్తిస్తున్నామని, దీని కోసం ఏఐ సాంకేతికతతో కూడిన కేంద్రీకృత వ్యవస్థ సాయాన్ని తీసుకొంటున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
8వ విడుతలో భాగంగా 2002లో ‘సర్’ను ప్రారంభించారు. 2004వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించడానికి అప్పటి ఈసీ అధికారులు ఇంటింటి సర్వేను నిర్వహించారు. మరణించిన, నకిలీ ఓటర్లను గుర్తించడానికి 2002 సర్‌లో బీఎల్వోలు (అప్పుడు ఎన్యుమరేటర్లుగా పిలిచేవారు) ఇం టింటికీ వెళ్లేవారు. అప్పటికే అందుబాటులో ఉ న్న జాబితాలోని వివరాలను ఇంట్లోని ఓటర్ల వివరాలతో చూసి ఫారాలను నింపేవారు. ము ఖ్యంగా 2000లో బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్‌లో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా చేపట్టారు. అప్పట్లో ఆధార్ కార్డు లేకపోవడం, సాంకేతికత అంతగా అభివృద్ధి సాధించకపోవడంతో ఇంటింటి సర్వేనే ప్రథమ ఆధారంగా అ ధికారులు భావించారు. సుమారు రెండేండ్లపా టు కొనసాగిన ఈ సర్వేలో పొరపాట్లను మ్యా న్యువల్గానే గుర్తించి నకిలీ, డూప్లికేట్, మరణించిన, శాశ్వతంగా మరో ప్రాంతానికి వె ళ్లిన వారి ఓట్లను అధికారులు తొలగించారు.
2025లో తొలిదఫా బిహార్‌లో, రెండో ద ఫాలో భాగంగా 12 రాష్ర్టాలు, యూటీల్లో దే శవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యింది. ఇ పుడు మూడో దఫాలో భాగం గా 19 రా ష్ర్టాలు, యూటీల్లో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నది. తొలి రెండు దఫాల్లో 13 రాష్ర్టాలు, మొత్తంగా 7.85 కోట్ల ఓట్లు తొలగించారు. అత్యధికంగా యూపీలో 2.04 ఓ ట్లు తొలగించారు. 2002 ‘సర్’ ప్రక్రియలో డ్రాఫ్ట్ స్టేజీలో 69,30,851 ఓట్లు తొలగించినట్టు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని విడుదల చేసింది.