హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ హుజూరాబాద్ నియోజకవర్గం వరకే ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) స్పష్టంచేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు శుక్రవారం లేఖ రాసింది. ఎన్నికల కోడ్ పరిధిపై స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇటీవల లేఖ రాయగా, దానిపై ఈసీఐ స్పష్టతనిచ్చింది.