ఆదిలాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖడ్కీ గ్రామస్థులు రెండో విడత పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతోపాటు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గణేశ్‌పూర్ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన ఖడ్కీలో 150 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సందర్భంగా వీరు ఓటు వేయకుండా గ్రామంలో బైఠాయించి నిరసన తెలిపారు.