వరంగల్ : కాంగ్రెస్(Congress) పాలనపై ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో ఊరూరా ఆ పార్టీకి వ్యతిరేకంగా సబ్బండ వర్ణాల ప్రజలు చావుడప్పు మోగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే దురుద్దేశంతో అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారు. తీరా గెలిచాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం రోడ్ల పైకి వచ్చి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
తాజాగా వరంగల్ జిల్లా ఖానాపురంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4 వేల పెన్షన్ (Pensions) ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని వృద్ధులు, దివ్యాంగులు నిరసన(Disabled protes) తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిలువునా మోసం చేశారని వాపోయారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు పెన్షన్ 4 వేలు, దివ్యాంగులకు 6 పెంచాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పెన్షన్ ఎప్పడు ఇస్తావంటూ ప్లకార్డులు పట్టుకుని వృద్ధులు, దివ్యాంగుల నిరసన
వరంగల్ జిల్లా ఖానాపురంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4 వేల పెన్షన్ ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన వృద్ధులు, దివ్యాంగులు pic.twitter.com/f1W0YBIq4C
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025