మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 26: బిల్లు ఆమోదం కోసం లంచం తీసుకుంటూ ఈజీఎస్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిద్దిపేట జిల్లా మద్దూరులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఈసీ (ఇంజినీరింగ్ కన్సల్టెంట్)గా పనిచేస్తున్న బండకింది పరశురాములు తన కిందిస్థాయి ఉద్యోగి వద్ద ఫైళ్ల చెక్ కొలతను ధ్రువీకరించడంతో పాటు బిల్లు ఆమోదం కోసం రూ.11,500 డిమాండ్ చేశారు. మంగళవారం సదరు ఉద్యోగి నుంచి పరశురాములు లంచం తీసుకుంటుండగా ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని స్వగ్రామమైన చేర్యాల మండలం శభాష్గూడెంలోని అతని ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పరశురాములును నాంపల్లిలో కోర్టులో జడ్జి ఎదుట హాజరుపర్చినట్టు డీఎస్పీ తెలిపారు.