ఇనుగుర్తి, ఆగస్టు 27: ఒద్దిరాజు సోదరులు సీతారాంచందర్రావు, రాఘవ రంగారావు తెనుగు పత్రికను స్థాపించి కవులు, రచయితలుగా తెలంగాణ రాష్ట్రంలో ఖ్యాతి గడించారని టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. తెనుగు పత్రికను స్థాపించి 102 ఏండ్లు కావడంతో మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఒద్దిరాజు సుభాష్ ఆధ్వర్యంలో తెనుగు దినపత్రిక శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ.. సుభాష్ ఆధ్వర్యంలో తెనుగు దినపత్రిక శతాబ్ది వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. బహుభాషా కోవిదుల విగ్రహాలను ట్యాంక్‌బండ్ మీద పెట్టడానికి కృషి చేస్తానని తెలిపారు. సంగీతం, సాహిత్యంతోపాటు వైద్యవిద్యను సైతం నేర్చుకొని స్వయంగా శస్త్రచికిత్సలు చేశారంటే.. వారు అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందారని గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇనుగుర్తికే పరిమితం కాకుండా హైదరాబాద్ వేదికగా జరగాలని ఆకాంక్షించారు.
ఆదివాసీల కోసం ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ వేయాలని, ఐటీడీ ఏలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, జీవో 3ను కొన-సాగించాలనే డిమాండ్లతో ఆదివాసీ సంఘం తుడుం దెబ్బ, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో వ్యాపారులు దుకాణాలు మూసి బంద్‌కు సహకరించారు. ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్