హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఆటోమీటర్ చార్జీల పెంపు, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు కూనంనేనిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బీ వెంకటేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటోమీటర్ చార్జీలు పెంచడంతోపాటు, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 12వేల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, రాపిడోల నుంచి డ్రైవర్లను రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.