హైదరాబాద్, జూన్ 15 : బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆర్జీయూకేటీ విద్యాలయంలో సౌకర్యాలు, ఇతర అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసువెళ్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హమీనిచ్చారు. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.