తరగతి గదిలో విద్యార్థికి పాఠ్యాంశంపై ఆసక్తి కలిగేలా, విద్యాబోధనలో మూస పద్ధతికి స్వస్తి పలికేందుకు కొత్త విధానానికి మనరాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఐఐటీ గాంధీనగర్ సహకారంతో సీసీఎల్‌ను ప్రవేశపెట్టి పాఠాలను సరికొత్తగా బోధించే ప్రక్రియను ప్రారంభించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మనకు టీచర్ నేర్పించినవాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి. మరికొన్నింటిని జీవితాంతం మరిచిపోలేం. ఆయా అంశాన్ని టీచర్ అద్భుతంగా చెప్పడమే ఇందుకు కారణం. ఇలాంటి విద్యాబోధనను మన టీచర్లు ఆకలింపు చేసుకునేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తున్నది. టీచర్లకు తర్ఫీదునిస్తున్నది. ఫలితంగా కొన్ని పాఠశాలల్లో సరికొత్త విద్యాబోధన అందుబాటులోకి వచ్చింది. ఐఐటీ గాంధీనగర్ సహకారంతో విద్యార్థులకు సులభంగా, జీవితాంతం గుర్తుండేలా పాఠాలను వినూత్నంగా బోధించే ప్రయత్నం ప్రారంభమైంది. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఫలితంగా టీచర్లు, విద్యార్థుల ద్వారా అబ్బురపరిచే అనేక కృత్యాలు ఆవిష్కృతమయ్యాయి.
కేసీఆర్ హయాంలోనే ఒప్పందం..
మూస పద్ధతిలో కొనసాగుతున్న విద్యాబోధనను మార్చి, విద్యార్థుల్లో అభ్యాసన ఆసక్తిని పెంపొందించేందుకు ప్రొఫెసర్ మనీశ్ జైన్ ఐఐటీ గాంధీనగర్‌లో సీసీఎల్(సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్)ను ప్రారంభించారు. పిల్లలు ఆసక్తిగా తమంతట తాముగా నేర్చుకోవడం, బోధనలో ఆటబొమ్మలు రూ పొందించేలా ఈ సంస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నది. కేవలం విషయాన్ని పిల్లల బుర్రల్లో చొప్పించడం కంటే వారే సొంతంగా ఆడుతూ శోధిస్తూ నేర్చుకోవాలన్నది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ వినూత్న బోధన కోసం రాష్ట్ర విద్యాశాఖ, కేసీఆర్ సర్కారు హయాంలో ఐఐ టీ గాంధీనగర్‌లోని సీసీఎల్‌తో ఒప్పం దం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీ గాంధీనగర్.. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కిట్, ఉన్నత పాఠశాలలకు గణితం, సైన్స్ కిట్లను అందజేస్తున్నది. దీంతోపాటు రాష్ట్రంలో మాడల్ సైన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో మన రాష్ర్టానికి చెందిన 300మంది టీచర్లకు ఐఐటీ గాంధీనగర్‌లో శిక్షణనిచ్చా రు. వీరిలో 100మంది చొప్పున గణి తం, ఫిజికల్ సైన్స్, మరో వంద మంది ప్రాథమిక పాఠశాలల్లో బోధించే టీచర్లున్నారు. శిక్షణ తర్వాత టీచర్లకు ఐఐటీ గాంధీనగర్ నిపుణులు మార్గదర్శనం చేస్తున్నారు. పలు రకాల బోధనోపకరణాలను సైతం రూపొందించారు.
వర్క్‌షాప్‌లో సరికొత్త కృత్యాలు