హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్‌లో పాఠశాల విద్యాశాఖ అధికారుల ప్రత్యేక బృందం రెండురోజుల పర్యటన ముగిసింది. గ్రంథాలయాల ఆధారంగా పిల్లలకు చదవడం, రాయడం నేర్పించేందుకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లింది. ఎస్సీఈఆర్టీ తెలుగు పాఠ్యపుస్తకాల కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్, మెదక్ డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్‌బాబు, పాఠ్యపుస్తక రచయితలు సంబరాజు రవిప్రకాశ్, గాజుల రవీందర్, రూమ్ టు రీడ్ స్టేట్ మేనేజర్ నర్సింహాచారి, కో ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్ బృందం రాజనందగావ్, రాయపూర్ తదితర జిల్లాల్లో పర్యటించింది. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ ప్రోగ్రాంలో ఛత్తీస్‌గఢ్ ప్రతి విద్యార్థికి ఎనిమిది సెట్ల పుస్తకాలను అందజేయడమే కాకుండా, పిల్లలవారీగా సామర్థ్యాలను రికార్డుచేసినట్టు, కరోనా సమయంలో టీచర్లు పిల్లల ఇండ్లకు వెళ్లి బోధించినట్టు బృందం సభ్యులు వెల్లడించారు.