హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజీ సబ్జెక్టులకు కూడా అభ్యాస దీపికలను అందించాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. వార్షిక పరీక్షల్లో స త్ఫలితాలు సాధించేందుకు నాన్ లాం గ్వేజీ సబ్జెక్ట్‌లకు అభ్యాస దీపికలు అందిస్తున్నారని తెలిపింది. లాంగ్వేజీ సబ్జెక్టులకు కూడా అందించాలని కోరింది.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ‘క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్’ పేరుతో ఫిబ్రవరిలో నిర్వహించనున్న పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని ప్రముఖ రచయిత, దర్శకురాలు సరస్వతీ బుయ్యాల పిలుపునిచ్చారు. మీడియా, వినోద రంగాలకు చెందిన అంతర్జాతీయ సదస్సు ‘వేవ్స్’లో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో గురువారం ‘అన్ లాకింగ్, స్టోరీ టెల్లింగ్’పై వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు.