హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని సాహితీ ఇన్ఫ్రా టెక్ కార్యాలయాలు, అనుబంధ సంస్థలు, ప్రమోటర్ బీ లక్ష్మీనారాయణ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది. నగరంలోని ఏడు ప్రాంతాల్లో దాడులు చేసింది. 3 వేల మంది వినియోగదారులను రూ.1,500 కోట్లకు మోసం చేసిందని సాహితీ సంస్థపై ఆరోపణ ఉంది.