హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): ఐడీబీఐ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా నగరంలోని నేరెళ్ల వెంకటరామ్మోహన్రావు, అతని బంధువుల ఇండ్లపై బుధవారం ఈడీ అధికారులు దాడులు జరిపారు. మొత్తం రూ.71.61 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించి అటాచ్ చేశారు. వెంకటరామ్మోహన్రావు తన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేర్లపై రాజమండ్రిలోని ఐడీబీఐ నుంచి నకిలీ కిసాన్ క్రెడిట్ కార్డులపై ఫిష్ట్యాంక్ రుణాలు తీసుకున్నాడని, ఈ క్ర మంలో బ్యాంకుకు రూ.311.05 కోట్ల మేర మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి.