హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు (ED Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంతోపాటు 16 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంతోపాటు, హిమాయత్‌సాగర్‌లోని ఫామ్‌హౌస్‌లోనూ సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి కుమార్తె ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. 16 బృందాలుగా విడిపోయి ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రెండు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రాఘవా ప్రైడ్‌లోనూ తనిఖీలు నిర్వహించారు.
మంత్రి పొంగులేటి ఫాం హౌస్ వద్ద ఈడీ సోదాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫాం హౌస్ వద్ద CRPF బలగాల బందోబస్తు మధ్య ఈడీ సోదాలు. https://t.co/Zd1aVLLEgL pic.twitter.com/36PAyBNiBf
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024