హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు గురువారం నగరంలోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ దుకాణాల్లో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. మనీ లాండరింగ్ ఆరో పణల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర దుకాణాల్లోనూ తనిఖీలు చేసినట్లు తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా 1,100 కిలోల బంగారు ఆభరణాలు మళ్లించిన ఆరోపణలపై 2019లో సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు.