హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మల్టీలెవెల్ మారెటింగ్ పేరుతో రూ. 5 వేల కోట్లకుపైగా మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిందితురాలు నౌహీరా షేక్, హీరా గ్రూప్‌నకు చెందిన రూ.159 కోట్ల విలువైన 23 స్థిరాస్తులను విజయవంతంగా వేలం వేసింది.
వేలం ద్వారా వచ్చిన సొమ్ము ను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో బాధితులకు, పెట్టుబడిదారులకు నష్టపరిహారంగా తిరిగి చెల్లించనున్నారు. కాగా, కేసులో ప్రధాన సూత్రధారి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.