హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సీపీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాయి కొమరేశ్వర్ అక్రమాల చిట్టా బయటపడుతున్నది. ఓ బిల్లు క్లియరెన్స్ కోసం లంచం తీసుకుంటూ కొరమేశ్వర్ దొరికిపోయారు. ఏసీబీ, సీబీఐ అధికారులు కొమరేశ్వర్ ఇంట్లో సోదాలు నిర్వహించి, 30.5 లక్షలు, లాకర్ కీ స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు కొమరేశ్వర్, అతడి భార్య పద్మావతికి చెందిన 1.27 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్చేశారు. బ్యాంకుల నుంచి అన్సెక్యూర్డ్ రుణాలు తీసుకొని ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించారు.