హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఎస్బీహెచ్(ఇప్పటి ఎస్బీఐ)ని మోసం చేసిన కేసులో సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సాగిరాజు సూర్యనారాయణకు చెందిన రూ.3.11కోట్ల స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
నకిలీ పత్రాలు సృష్టించి కల్పిత ఆస్తులను కొలాటరల్ ఆస్తులుగా చూపించి రూ.15కోట్లకు ఎస్బీహెచ్ను మోసం చేయడంతో బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. మోసం చేసిన సొమ్ములో కొంత ఎండీ, డైరెక్టర్ల ఖాతాలకు తరలించినట్టు విచారణలో తేలింది. సీబీఐ చార్జిషీటు ఆధారంగా పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ, పలు దఫాలుగా ఆస్తులను జప్తు చేసింది.