తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్యదూరమని రోజుకోసారి బయటపడుతున్నది. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయిన’మంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యాలని తేటతెల్లమైంది. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ వందేండ్ల అభివృద్దిని సాధించిందని మరోమారు రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు, మార్సిలస్ వ్యవస్థాపకుడు, సీఐవో సౌరభ్ ముఖర్జియా తేల్చిచెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన ఆర్థికాభివృద్ధిని వేనోళ్ల కొనియాడారు.
Telangana | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 6: కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన సమ్మిళిత అభివృద్ధిని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన గోబెల్ ప్రచారం అబద్ధమని మరోసారి తేలిపోయింది. ‘పదేండ్లలో వందేండ్ల విధ్వంసం’ అంటూ కాంగ్రెస్ సర్కారు చేసిన దుష్ప్రచారం ఉత్తదేనని నిరూపితమైంది. తెలంగాణ ఆర్థికాన్ని కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని రేవంత్ సర్కారు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి రూఢీ అయ్యింది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రముఖ ఆర్థిక నిపుణులు, మార్సిలస్ వ్యవస్థాపకుడు, సీఐవో సౌరభ్ ముఖర్జియా ప్రశంసించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణను కొనియాడారు.
గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ఆర్థికరంగం రెట్టింపు అయ్యింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచింది. ఆర్థికాభివృద్ధిరేటులో ప్రపంచంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి-భద్రతలు తదితర అంశాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది.
2014-15: 4.3 లక్షల కోట్లు
2023-24: 15.01 లక్షల కోట్లు
2014-15: రూ. 1,03,889
2023-24: రూ. 3,56,564
2014-15: 11,583 కోట్లు
2023-24: 78,611 కోట్లు
చర్చలో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దక్షిణాది రాష్ర్టాల వాటా గురించి మాట్లాడిన సౌరభ్ ముఖర్జియా.. తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ఆర్థికరంగం రెట్టింపు అయ్యిందని వెల్లడించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచినట్టు కితాబిచ్చారు. ఆర్థికాభివృద్ధి రేటులో ప్రపంచంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు వివరించారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి-భద్రతలు తదితర అంశాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. అలా గడిచిన కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో ఎంతో వృద్ధి సాధించిందని ప్రశంసలవర్షం కురిపించారు.
కేసీఆర్హయాంలో తెలంగాణ సాధించిన ఆర్థికాభివృద్ధిని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఓ నివేదికలో గణాంకాలతోసహా ప్రశంసించడం తెలిసిందే. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ పదేండ్ల వ్యవధిలో 243% వృద్ధిరేటును నమోదుచేసినట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. జీఎస్డీపీలో 249% పెరుగుదల నమోదైనట్టు వివరించింది. స్థాపిత విద్యుత్తు సామర్థ్యం పెంపు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, మూలధన వ్యయంలో పెరుగుదల, సాగునీటి సదుపాయం ఇలా ప్రతి అంశంలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని ఆర్బీఐ గణాంకాలతో సహా వెల్లడించింది.
సౌరభ్ ముఖర్జియా ప్రఖ్యాత ఆర్థిక నిపుణు లు. రచయిత. 1976 లో జన్మించారు. పూర్వీకులది కోల్‌కతా. స్కూ ల్, కళాశాల విద్య లం డన్లోనే సౌరభ్ పూర్తయింది. ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసిన సౌరభ్.. క్లియర్ క్యాపిటల్, మార్సిలస్ వంటి సక్సెస్ఫుల్ కంపెనీలకు వ్యవస్థాపకులుగా ఉన్నా రు. ఇండియాలోని అసోసియేషన్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. సెబీ, ఆర్బీఐ నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశాల్లో విలువైన సూచనలిచ్చే అతికొద్ది మందిలో ఈయన కూడా ఒకరిగా చెప్తారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పలు పాలసీలలో కూడా ఈయన పలు సూచనలు చేశారు. ‘గురూస్ కియాస్-మోడర్న్ ఇండియాస్ మనీ మాస్టర్స్’, ‘ది అన్యూజువల్ బిలియనీర్స్’, ‘కిస్ కంపెనీ మే ఇన్వెస్ట్ కర్నే’, ‘డైమండ్స్ ఇన్ ది డస్ట్’, ‘షేర్ మార్కెట్ కా సక్సెస్ మంత్ర’ వంటి ఎన్నో పుస్తకాలు రచించారు. ఇవన్నీ బెస్ట్ సెల్లర్స్‌గా నిలిచాయి. సౌరభ్‌ను ఆయన అభిమానులు ‘మనీగురు’గా పిలుస్తారు.