నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 22 : బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7 శాతం నిధులు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు శనివారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఇందుకోసం బయలుదేరిన విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
పలుచోట్ల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొని చలో అసెంబ్లీకి వెళ్లకుండా కట్టడిచేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు.