హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు ఈ నెల 24, 25న ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు, 27న సీట్లను ఫ్రీజ్ చేయనుండగా, 31న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్ట్ చేయడంతో పాటు, ట్యూషన్ ఫీజు చెల్లించాలి.