హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఈగల్‌ఫోర్స్ మరొక భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఒకేసారి సోదాలు నిర్వహించి డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 19 మంది నిందితుల్లో 14 మంది టీహెచ్‌సీ (గంజాయిలో ఉండే మత్తు పదార్థం) వినియోగించినట్టు నిర్ధారించారు. చక్రి, హర్షిద్రెడ్డి అనే వ్యక్తులు గోవాలోని వాగటర్ బీచ్ ప్రాంతంలో హాస్ట ల్ అద్దెకు తీసుకుని బెంగళూరు నుంచి కొకైన్, ఎండీఎంఏ మాత్రలు, ఎల్ఎస్డీ, ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్ సేకరించి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందింది.
చక్రి సినీ పరిశ్రమలో కొకైన్ విక్రయిస్తుండగా, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, హ్యాష్ ఆయిల్‌ను ఎల్బీనగర్ ప్రాంతంలో సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్‌కు అందిన సమాచారాన్ని ఈగల్ సాంకేతిక బృందం విశ్లేషించి హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మొత్తం 44 మంది వినియోగదారులను గుర్తించినట్లు సం దీప్ శాండిల్య వెల్లడించారు. నాగోల్, వనస్థలిపురం, చైతన్యపురి, కర్మన్‌ఘాట్, బోయిన్పల్లి, సంతోష్‌నగర్, మణికొండతోపాటు మెదక్, నిజామాబాద్ లో సోదాలు చేపట్టి వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
మరోవైపు ఈ నెట్‌వర్క్‌లో ఏపీ, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన కొందరు వినియోగదారుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన డ్రగ్స్ విక్రేతలు హైదరాబాద్‌లో లేకపోవడంతో డ్రగ్స్‌కు డిమాం డ్ తగ్గించే లక్ష్యంతో వినియోగదారులపై దృష్టి సారించారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వినియోగదారులు పెడ్లర్స్ అయిన చక్రపాణి, హర్షిద్రెడ్డి వద్ద నుంచి గంజాయి, మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. ఇటీవల డ్రగ్స్ కొనుగోళ్ల కోసం చక్రపాణికి రూ.1,46,950, హర్షిద్రెడ్డికి రూ.1,66, 150 చెల్లించినట్టు అధికారులు గుర్తించారు. నిందితులు చక్రపాణి, హర్షిద్రెడ్డి 2019లో నమోదైన ఎన్డీపీఎస్ కేసులోనూ అరెస్టయినట్టు వెల్లడించారు.