హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముంబైలో తెలంగాణ ఈగల్ టీమ్ కౌంటర్ అటాక్ చేసింది. ఓ నైజీరియా డ్రగ్ రాకెట్ ద్వారా ముంబైలోని పలువురు హవాలా వ్యాపారులు, డ్రగ్స్ పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో ఈగల్ పోలీసులు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో 14మంది ముంబైకు చెందిన వ్యాపారులు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును నైజీరి యా సహా ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. దీనిపై మంగళవారం నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్‌శాండిల్య వివరాలు వెల్లడించనున్నారు. ముంబై పోలీసులు తెలంగాణకు వచ్చి.. సీక్రెట్‌గా భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించడంతో.. దానికి కౌంటర్‌గా ముంబైలోని తెలంగాణ పోలీసులు డ్రగ్స్ హవాలా నెట్‌వర్క్‌పై దాడులు చేశారని తెలిసింది.